మత్తు పదార్థాల విక్రయాలపై నిఘా

ABN , First Publish Date - 2023-02-06T23:11:19+05:30 IST

మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల విక్ర యాలపై నిఘా పెంచాలని కలెక్టరు సూర్యకుమారి ఆదే శించారు. సోమవారం అధికారులతో సమీక్షించారు. వీటి నియంత్రణకు ప్రతినెలా ప్రణాళిక రూపొందించుకోవాల న్నారు. యువత వీటి బారిన పడకుండా చర్యలు చేప ట్టాలన్నారు. విద్యాసంస్థల్లో అవగాహన పెంచాలన్నారు.

మత్తు పదార్థాల విక్రయాలపై నిఘా
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ సూర్యకుమారి

మత్తు పదార్థాల విక్రయాలపై నిఘా

కలెక్టర్‌ సూర్యకుమారి

కలెక్టరేట్‌: మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల విక్ర యాలపై నిఘా పెంచాలని కలెక్టరు సూర్యకుమారి ఆదే శించారు. సోమవారం అధికారులతో సమీక్షించారు. వీటి నియంత్రణకు ప్రతినెలా ప్రణాళిక రూపొందించుకోవాల న్నారు. యువత వీటి బారిన పడకుండా చర్యలు చేప ట్టాలన్నారు. విద్యాసంస్థల్లో అవగాహన పెంచాలన్నారు. వీటి వాడకంతో కలిగే అనర్థాలను వివరించాలన్నారు. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవా లన్నారు. మద్యం షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యాసంస్థల్లో ఫిర్యాదు బా క్సులను తప్పనిసరి చేయాలన్నారు. సమావేశంలో జాయిం ట్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఆధికారి, ఎక్సైజ్‌ సూపరింటిండెంట్‌ వి.సుధీర్‌, డీఎంహెచ్‌వో రమణకుమారి, ఐసీడిఎస్‌ పీడీ శాంతి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రత్నం, బీసీ సంక్షేమ శాఖ అధికారి యశోధనరావు పాల్గొన్నారు.

టిడ్కో ఇళ్లను అప్పగించాలి

టిడ్కో ఇళ్లను తక్షణం లబ్ధిదారులకు అందించాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం స్పం దన విభాగంలో కలెక్టర్‌ సూర్యకుమారికి వినతిపత్రం అం దించారు. టీడీపీ హయాంలో 90 శాతం పనులు పూర్త య్యాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతు న్నా పది శాతం పనులు చేయలేకపోయిందన్నారు. లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. వెంటనే లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయుకులు ఐవీపీ రాజు, కనకల మురళీ మోహన్‌, బీవీ ప్రసాద్‌రావు పాల్గొన్నారు.

అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలి

అపరాలకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు రాంబాబు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ స్పందన విభాగంలో వినతిపత్రం అందించారు. క్వింటా పెసలు మార్కెట్‌ మద్దతు ధర రూ.7,750 ఉంటే రూ.6,800, మినుములు క్వింటా రూ.6,600 ఉంటే రూ.5,900లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. రైతులు క్వింటా వద్ద రూ.1000 నష్టపోతున్నారని అన్నారు. అందుకే ప్రభుత్వమే నేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా అందించిన వేరుశెనగ విత్తనాలు 70 శాతం వరకూ మొలవలేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. కొత్తవలస,ఎల్‌.కోట మండలాల్లో 700 బస్తాల వేరుశెనగ విత్తనాలు కుళ్లినవి అందించడంతో మొలవలేదని చెప్పారు.

Updated Date - 2023-02-06T23:11:21+05:30 IST