సబ్‌ప్లాన్‌ నిధులు మళ్లిస్తున్నారు..

ABN , First Publish Date - 2023-02-01T23:40:03+05:30 IST

ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లిస్తున్నారన్నారని కురుపాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి ఆరోపించారు.

సబ్‌ప్లాన్‌ నిధులు మళ్లిస్తున్నారు..
మాట్లాడుతున్న జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం: ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లిస్తున్నారన్నారని కురుపాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి ఆరోపించారు. బుధవారం గుమ్మలక్ష్మీపురంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ పార్వ తీపురం ఐటీడీఏలో నిధులు కొరత వల్ల అభివృద్ధి పనులు జరగడం లేదని తెలిపారు. ప్రభుత్వం స్పందించి గిరిజన అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఐటీడీఏలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితుల్లో కూడా లేరన్నారు. నియోజకవర్గంలో వందకుపైగా మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు లేవని తెలిపారు. మౌలిక వసతుల కల్పన అంతంతమాత్రంగానే ఉందని విమర్శించారు. గిరిజన యువతకు శిక్షణ, ఉపాధి లేదని ఆరోపించారు. నిధులు కొరత వల్ల నాడు-నేడు పనులు కూడా జరగడం లేదని ధ్వజమెత్తారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి శూన్యంగా మారిందని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఇదేమిఖర్మ కార్య క్రమంలో గ్రామ గ్రామానికి తెలియజేస్తున్నామని తెలిపారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం

ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కురుపాం నియోజ కవర్గ టీడీపీ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. బుధవారం గుమ్మ లక్ష్మీపురంలో క్లస్టర్‌ నెంబర్‌ 3,8,9,10,11 క్లస్టర్‌ ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రెండోదశ ఓటర్ల వెరిఫికేషన్‌ పూర్తిచేయాలని కోరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయా త్రకు వస్తున్న మంచి స్పందనను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గం నుంచి యువత ముందుకు వచ్చి పార్టీకి మద్దతు పలికేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:40:04+05:30 IST