రైలు నుంచి జారిపడి..
ABN , First Publish Date - 2023-01-26T00:35:11+05:30 IST
రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని యువకుడు మృతిచెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.

- గుర్తుతెలియని యువకుడి మృతి
బొండపల్లి: రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని యువకుడు మృతిచెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. బొబ్బిలి రైల్వే హెచ్సీ కృష్ణారావు తెలిపిన వివరాల మేరకు... గొట్లాం రైల్వే స్టేషన్ పరిధిలో రాయగడ నుంచి విశాఖ వెళ్తున్న ప్యాసింజర్ రైలు నుంచి సుమారు 25 నుంచి 30 సంవత్సరాల వయ స్సు ఉండే యువకుడు జారి పడినట్టుగా అదే రైలు గార్డు గుర్తించాడు. తీవ్రంగా గాయపడిన అతడిని గార్డు తన బోగిలో ఎక్కించుకొని విజయన గరం చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని ఒంటిపై ముదురు నీలం రంగు టీషర్టు, జీను ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఆచూకీ తెలిసిన వారు బొబ్బిలి రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ రవివర్మ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.