ఆటో బోల్తా .. ఆరుగురికి గాయాలు

ABN , First Publish Date - 2023-03-18T23:39:49+05:30 IST

స్థానిక బొబ్బిలి రోడ్డులోని వస్త్రపురి కాలనీ మీదుగా రాజాం పట్టణంలోకి వస్తున్న ఆటో ఎఫ్‌సీఐ గొడౌన్‌ సమీపంలో శనివారం మధ్యాహ్నం బోల్తా పడడంతో ఆరుగురికి గాయాలయ్యాయి.

ఆటో బోల్తా .. ఆరుగురికి గాయాలు

రాజాం రూరల్‌: స్థానిక బొబ్బిలి రోడ్డులోని వస్త్రపురి కాలనీ మీదుగా రాజాం పట్టణంలోకి వస్తున్న ఆటో ఎఫ్‌సీఐ గొడౌన్‌ సమీపంలో శనివారం మధ్యాహ్నం బోల్తా పడడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో గుర్ల మండలంలోని గొలగాం గ్రామానికి చెందిన తల్లికూతుర్లు నారాయణ, సత్యవతితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న కృష్ణవేణి గాయపడడంతో రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. మరో ముగ్గురు చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు గొలగాం గ్రామానికి చెందిన సత్యవతి రాజాం పొలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-18T23:39:49+05:30 IST