కానిస్టేబుల్‌పై దాడి కేసులో ఇద్దరికి ఏడాది జైలు

ABN , First Publish Date - 2023-02-01T23:38:14+05:30 IST

పేకాట శిబిరంపై దాడి చేసి జూదరులను పట్టుకున్న ఘటనలో పోలీసు కానిస్టేబుల్‌పై తిరగబడి దాడి చేసిన ఇద్దరు నిందితులకు జైలు శిక్ష, జరి మానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు సీఐ ఎం.నాగేశ్వరరావు తెలిపారు.

కానిస్టేబుల్‌పై దాడి కేసులో ఇద్దరికి ఏడాది జైలు

బొబ్బిలి: పేకాట శిబిరంపై దాడి చేసి జూదరులను పట్టుకున్న ఘటనలో పోలీసు కానిస్టేబుల్‌పై తిరగబడి దాడి చేసిన ఇద్దరు నిందితులకు జైలు శిక్ష, జరి మానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు సీఐ ఎం.నాగేశ్వరరావు తెలిపారు. ఆయన బుధవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2019 నవంబరు 17న బొబ్బిలి మండలం గున్నతోటవలస రాణిగారితోటలో జూదమాడుతున్న వారిని పట్టుకునేం దుకు పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో పారాది గ్రామానికి చెందిన కలిశెట్టి శశిభూషణరావు, పట్టణంలోని కోరాడ వీధికి చెందిన రవ్వ శ్రీనుబాబు అనే నింది తులు మండంగి సూరయ్య అనే పోలీసు కానిస్టేబుల్‌పై తిరగబడి దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను కోర్టుకు అప్పగించారు. కోర్టులో విచారణ జరిపిన అనంతరం నిందితులిద్దరికీ బుధవారం స్థానిక పీజే సీఎం కమ్‌ ఏజేఎఫ్‌సీఎం కోర్టు మెజిస్ర్టేట్‌ ఎ.సరోజనమ్మ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్ష, రెండు వేల రూపాయల చొప్పున జరిమా నా విధిస్తూ మెజిస్ర్టేట్‌ తన తీర్పును వెలువరించారు.

Updated Date - 2023-02-01T23:38:16+05:30 IST