ఈ ప్రభుత్వంలో ఎస్టీలకు అన్యాయం

ABN , First Publish Date - 2023-01-26T00:29:27+05:30 IST

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జిల్లా ఎస్టీ ఏకలవ్య సంఘ అధ్యక్షుడు, గజరాయనివలస టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు పాలవలస గౌరు అన్నారు.

ఈ ప్రభుత్వంలో ఎస్టీలకు అన్యాయం

బాడంగి, జనవరి 25: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జిల్లా ఎస్టీ ఏకలవ్య సంఘ అధ్యక్షుడు, గజరాయనివలస టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు పాలవలస గౌరు అన్నారు. బుధ వారం ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో 35 గిరిజన తెగలు 37 స్కీముల ద్వారా స్వయం ఉపాధి పొందేవారమని, ఐటీడీఏ ద్వారా జిల్లాలోని వందలాది కుటుంబాలకు ఉపాధి దొరికేదన్నారు. కానీ నేడు వైసీపీ ప్రభుత్వంలో వీటి ద్వారా ఒక్క పథకం కూడా మంజూరుకావడం లేదన్నారు. లక్ష్మీపురం మధుర గ్రామమైన ఎరుకుల పాకల్లో 2006లో రూ.200ల పెన్షన్‌ పొందుతూ 2022లో రూ.2,500ల పెన్షన్‌ తీసుకునేవారని, నేడు ఈ ప్రభుత్వం వివిధ కారణాలు చూపి పదుల సంఖ్యలో పింఛన్లు తొలగించడం అన్యాయమన్నారు. తక్షణమే ఎరుకుల పాకల్లో ఉన్న పింఛన్లు కోల్పోయిన వారికి నేరుగా వైద్య పరీక్షలు నిర్వహించి వయస్సు ఆధారంగా వారి పెన్షన్లు పునరుద్ధరించాలని కోరారు. లక్ష్మీపురం సర్పంచ్‌ పాలవలస పార్వతి, పెన్షన్లు తొలగిపోయిన వారు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:29:29+05:30 IST