భూ ఆక్రమణ ఫిర్యాదులపై దృష్టి

ABN , First Publish Date - 2023-02-06T23:18:43+05:30 IST

భూ ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని పోలీస్‌ అధికారులను జిల్లా ఎస్పీ దీపికా పాటిల్‌ ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో స్పందన నిర్వహించారు. 33 ఫిర్యాదులను స్వీకరించారు. తన తల్లి ద్వారా దఖలుపడిన ఆస్తిని కొంతమంది దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని పూసపాటిరేగ మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదుచేశారు.

భూ ఆక్రమణ ఫిర్యాదులపై దృష్టి

భూ ఆక్రమణ ఫిర్యాదులపై దృష్టి

ఎస్పీ దీపికా పాటిల్‌

విజయనగరం కైం, ఫిబ్రవరి 6: భూ ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని పోలీస్‌ అధికారులను జిల్లా ఎస్పీ దీపికా పాటిల్‌ ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో స్పందన నిర్వహించారు. 33 ఫిర్యాదులను స్వీకరించారు. తన తల్లి ద్వారా దఖలుపడిన ఆస్తిని కొంతమంది దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని పూసపాటిరేగ మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదుచేశారు. సీబీఐ అధికారినని చెప్పి రూ.4.55 అప్పుగా తీసుకొని చెల్లించడం లేదని.. నగదు ఇప్పించాలని రాజాం పట్టణానికి చెందిన ఓ మహిళ ఎస్పీకి ఫిర్యాదుచేశారు. తన భూమిలో రేకుల షెడ్‌ నిర్మిస్తే అక్రమంగా తొలగించారని.. అడ్డుచెబుతూ కొందరు కూలగొట్టారని.. అధికారులు తన స్థలంగా ధ్రువీకరించినా బెదిరింపులకు దిగుతున్నారని పూసపాటిరేగ మండలం నడిపల్లికి చెందిన లంకలపల్లి వెంకటరావు ఎస్పీకి ఫిర్యాదుచేశారు. స్పందించిన ఎస్పీ తక్షణం విచారణ చేపట్టి నివేదికలు అందించాలని సంబంధిత పోలీస్‌స్టేషన్ల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు మురళీ, రుద్రశేఖర్‌, ఎస్‌ఐలు వాసుదేవ్‌, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:18:45+05:30 IST