తవ్వేసి.. వదిలేశారు!

ABN , First Publish Date - 2023-02-06T23:14:54+05:30 IST

విశాఖ-అరకు ప్రధాన రహదారి ఇది. ఇలా యంత్రాలతో తవ్వేసి పూడ్చకుండా విడిచిపెట్టారు. దారిపొడవునా గోతులు ఏర్పడడంతో మరమ్మతులకు ఉపక్రమించారు. వారం రోజుల కిందట జేసీబీతో ఇలా తవ్వారు. కానీ గోతులు పూడ్చకుండా అలానే వదిలేశారు. కొత్తవలస మండలం చింతలపాలెం నుంచి ఎస్‌.కోట మండలం బొడ్డవర వరకూ ఇలానే విడిచిపెట్టడంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు.

తవ్వేసి.. వదిలేశారు!

తవ్వేసి.. వదిలేశారు!

శృంగవరపుకోట: విశాఖ-అరకు ప్రధాన రహదారి ఇది. ఇలా యంత్రాలతో తవ్వేసి పూడ్చకుండా విడిచిపెట్టారు. దారిపొడవునా గోతులు ఏర్పడడంతో మరమ్మతులకు ఉపక్రమించారు. వారం రోజుల కిందట జేసీబీతో ఇలా తవ్వారు. కానీ గోతులు పూడ్చకుండా అలానే వదిలేశారు. కొత్తవలస మండలం చింతలపాలెం నుంచి ఎస్‌.కోట మండలం బొడ్డవర వరకూ ఇలానే విడిచిపెట్టడంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలకు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గోతులు పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2023-02-06T23:14:55+05:30 IST