పాదయాత్రను అడ్డుకుంటే సహించేదిలేదు

ABN , First Publish Date - 2023-02-06T23:46:57+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు అడుగడు గునా ఆటంకం కలిగించడం సరికాదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ,మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ అన్నారు.

పాదయాత్రను అడ్డుకుంటే సహించేదిలేదు
విలేఖరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ జగదీష్‌

- టీడీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి జగదీష్‌

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు అడుగడు గునా ఆటంకం కలిగించడం సరికాదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ,మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ అన్నారు. సోమవారం ఆయన నెల్లూరు నుంచి ఫోన్‌ ద్వారా ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. లోకేశ్‌ పాద యాత్రకు అనుమతులు ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్పు కుంటూనే అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తుం డడంపై మండిపడ్డారు. నెల్లూరులో జరిగిన యు వగళం పాదయాత్రలో భాగస్వామ్యం కావడమే కాకుండా అక్కడ జరిగిన పరిణామాలపై విలేఖరుల సమావేశంలో వివరించి, ప్ర భుత్వాన్ని హెచ్చరిం చినట్టు చెప్పారు. ఇప్పటికే కోర్టు అ క్షింతలు వేస్తున్నా అధికారు లకు జ్ఞానోదయం కలగడం లే దన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమ ని, ప్రజలు ఎన్నికల కోసం ఎ దురుచూస్తున్నారన్నారు. అధికారం వైసీపీకి శాశ్వతం కాదని దీనిని గుర్తించి పోలీస్‌ అధికారులు చట్టప్రకా రం విధులు నిర్వహించాలని సూచించారు. ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు త ప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు స్పష్టించిన పాదయాత్రను కొనసాగిస్తామన్నారు.

Updated Date - 2023-02-06T23:46:58+05:30 IST