మడ్డువలస మరమ్మతులకు చర్యలు
ABN , First Publish Date - 2023-01-25T00:11:53+05:30 IST
మడ్డువలస రిజర్వాయర్ మరమ్మతులకు నిధులు ఎట్టకేలకు మంజూరుకావడంతో పనులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఇటీవల రూ. 18 కోట్లు విడుదలచేసి గుత్తేదారును ఆన్లైన్ టెండర్ ద్వారా పిలవడంతో పనులు దక్కించుకున్న గుత్తేదారు ఫిబ్రవరి మొదటివారంలో పనుల ప్రారంభించనున్నారు.

వంగర: మడ్డువలస రిజర్వాయర్ మరమ్మతులకు నిధులు ఎట్టకేలకు మంజూరుకావడంతో పనులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఇటీవల రూ. 18 కోట్లు విడుదలచేసి గుత్తేదారును ఆన్లైన్ టెండర్ ద్వారా పిలవడంతో పనులు దక్కించుకున్న గుత్తేదారు ఫిబ్రవరి మొదటివారంలో పనుల ప్రారంభించనున్నారు. ఈ నిదులతో మడ్డువలస రిజర్వాయర్ ప్రధాన గేట్ల మరమ్మతులతోపాటు స్టాప్‌లాక్ గేట్లు, కాలువ మొదటి బాగములో కాలువ కాంక్రిట్ పనులు చేపట్టాల్సి ఉంది. రిజర్వాయర్ మరమ్మతులకు అధికారులు వివిధ సమయాల్లో రూ. 56 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. అనేకసార్లు వరదలు వచ్చినపుడు నాలుగు గ్రామాలు ముంపునకు గురైన విషయాన్ని ప్రభుత్వానికి వివరించడంతో ఎట్టకేలకు నామమాత్రంగా రూ. 18 కోట్లు విడుదల చేశారు.
ఫ మడ్డువలస రిజర్వాయర్ ప్రధాన గేట్ల మరమ్మతులకు రూ.18 కోట్లు మంజూరు, గుత్తేదారు నియామకాలు జరిగాయి. ఫిబ్రవరి మొదటి వారంలో పనులు ప్రారంభంకానున్నాయి. రబీ పంటలకు నీరు నిలుపుదల విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జేఈ నితిన్ తెలిపారు.