రెవెన్యూ ప్రాంతీయ సదస్సు రేపు

ABN , First Publish Date - 2023-02-02T00:26:00+05:30 IST

శ్రీకాకుళం నుంచి బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ వరకు గల తొమ్మిది జిల్లాలకు సంబంధించి రెవెన్యూ ప్రాంతీయ సదస్సు శుక్రవారం రుషికొండలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో జరగనున్నది. ఈ సదస్సును ఉదయం 10.30 గంటలకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించనున్నారు.

రెవెన్యూ ప్రాంతీయ సదస్సు రేపు

తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఇతర అధికారులు రాక

విశాఖపట్నం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నుంచి బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ వరకు గల తొమ్మిది జిల్లాలకు సంబంధించి రెవెన్యూ ప్రాంతీయ సదస్సు శుక్రవారం రుషికొండలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో జరగనున్నది. ఈ సదస్సును ఉదయం 10.30 గంటలకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించనున్నారు. ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ, 22-ఎ జాబితాలో భూములు, చుక్కల భూములు, సాదాబైనామా, అనాధీన భూములు, ఆర్‌ఓఆర్‌ చట్టం, భూముల మ్యుటేషన్‌, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు, నాలా, ఆక్రమణల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, డీఆర్వోలు, సబ్‌కలెక్టర్లు/ ఆర్‌డీవోలు, ప్రతి జిల్లా నుంచి ఎంపిక చేసిన పది మంది తహసీల్దార్లు, సర్వే శాఖ సహాయ సంచాలకులు, జిల్లా రిజిస్ట్రార్లు హాజరవుతారు. భూపరిపాలనా ముఖ్య కమిషనర్‌, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, సర్వే డైరెక్టర్‌, ఇతర అధికారులు హాజరవుతారు.

Updated Date - 2023-02-02T00:26:02+05:30 IST