‘గర్జన’లో పాల్గొనాలని ప్రజాప్రతినిధులకు ఆహ్వానం

ABN , First Publish Date - 2023-01-25T00:44:48+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 30న చేపట్టనున్న కార్మిక ప్రజా గర్జనలో పాల్గొనవలసిందిగా కోరుతూ శ్రీకాకుళంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు, మిందిలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆహ్వాన పత్రికలను అందజేశారు.

‘గర్జన’లో పాల్గొనాలని ప్రజాప్రతినిధులకు ఆహ్వానం
శ్రీకాకుళంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడుకు ఆహ్వాన పత్రాన్ని అందజేస్తున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు

ఉక్కుటౌన్‌షిప్‌, జనవరి 24: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 30న చేపట్టనున్న కార్మిక ప్రజా గర్జనలో పాల్గొనవలసిందిగా కోరుతూ శ్రీకాకుళంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు, మిందిలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆహ్వాన పత్రికలను అందజేశారు. కార్మిక ప్రజా గర్జనకు మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వారిని కలిసిన వారిలో పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, నాయకులు కేఎస్‌ఎన్‌ రావు, జె.అయోధ్యరామ్‌, నీరుకొండ రామచంద్రరావు, బి.అప్పారావు, సుబ్బయ్య, తదితరులు ఉన్నారు.

కార్మికులంతా కుటుంబ సభ్యులతో పాల్గొనండి

స్టీల్‌ప్లాంట్‌ తృష్ణా మైదానంలో ఈ నెల 30న జరగనున్న కార్మిక ప్రజా గర్జనలో కార్మికులంతా కుటుంబ సభ్యులతో అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా ఇంటక్‌ కాంట్రాక్టు కార్మిక సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కురందాసు వంశీకృష్ణ కోరారు. ప్లాంట్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో కాంట్రాక్టు కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉక్కు ఉద్యమంలో ఇంటక్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇంటక్‌ తరపున కార్మిక వర్గం కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ‘గర్జన’ను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు కె.అవతారం, భాస్కరరావు, నగేశ్‌, కోన రమణ, బి.అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:44:48+05:30 IST