తెల్లారినట్టే లేదే..

ABN , First Publish Date - 2023-02-07T00:25:57+05:30 IST

మన్యంలో వారం రోజుల తరువాత పొగమంచు సోమవారం దట్టంగా కురిసింది. కొన్ని రోజులుగా ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతున్నప్పటికీ పొగ మంచు మాత్రం కురవలేదు. కానీ సోమవారం మాత్రం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు పొగ మంచు దట్టంగా కమ్మేసింది.

తెల్లారినట్టే లేదే..
పాడేరులో సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు దట్టంగా పొగ మంచు

పాడేరులో ఉదయం 9.30 గంటల వరకు పొగ మంచు

చింతపల్లిలో 8.9 డిగ్రీలు నమోదు

మన్యంలో కొనసాగుతున్న చలి

పాడేరు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మన్యంలో వారం రోజుల తరువాత పొగమంచు సోమవారం దట్టంగా కురిసింది. కొన్ని రోజులుగా ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతున్నప్పటికీ పొగ మంచు మాత్రం కురవలేదు. కానీ సోమవారం మాత్రం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు పొగ మంచు దట్టంగా కమ్మేసింది. దీంతో వాహనచోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు.

చింతపల్లిలో 8.9 డిగ్రీలు

చింతపల్లి: మన్యంలో మళ్లీ చలి ప్రజలను వణికిస్తున్నది. సోమవారం చింతపల్లిలో 9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాకర్‌ ఎం.సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఏజెన్సీలో ఉదయం వేళల్లో మంచు దట్టంగా కురుస్తున్నది. పది రోజుల కిందట నుంచి క్రమంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. ఆదివారం 10 డిగ్రీలు నమోదుకాగా, సోమవారం 8.9 డిగ్రీలు నమోదైంది. దీంతో మరోసారి చలి తీవ్రత పెరిగింది. సీజన్‌ ఆఖరిలోనూ చలి వణికించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా లంబసింగి, చెరువువేనం ప్రకృతి అందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు.

Updated Date - 2023-02-07T00:26:02+05:30 IST