గవరపాలెం గౌరమ్మకు ఘనంగా సారె

ABN , First Publish Date - 2023-01-26T01:13:05+05:30 IST

స్థానిక గవరపాలెం గౌరీపరమేశ్వరుల సారె ఊరేగింపు బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది.

గవరపాలెం గౌరమ్మకు ఘనంగా సారె
అమ్మవారి సారె ఊరేగింపు నిర్వహిస్తున్న భక్తులు

పిండివంటలు, మిఠాయిలు, పండ్లు సమర్పించిన భక్తులు

అనకాపల్లి టౌన్‌, జనవరి 25: స్థానిక గవరపాలెం గౌరీపరమేశ్వరుల సారె ఊరేగింపు బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా గౌరీపరమేశ్వరుల ఉత్సవాల ముందు అమ్మవారికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. తొలుత సారె ఊరేగింపును ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, విష్ణుమూర్తి దంపతులు ప్రారంభించారు. అంతకుముందు వివిధ ప్రాంతాల నుంచి మహిళలు రకరకాల పిండివంటలు, మిఠాయిలు, పసుపు, కుంకుమ, పండ్లు తీసుకువచ్చారు. అనంతరం సారె తీసుకుని గవరపాలెంలోని పలు ప్రాంతాల్లో ఊరేగించి తిరిగి ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. తరువాత ప్రసాదాన్ని (పిండి వంటలను) ఇళ్లకు తీసుకెళ్లి ఇరుగుపొరుగువారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్‌ కొణతాల సంతోష్‌ అప్పారావునాయుడు, కార్యదర్శి కొణతాల శ్రీనివాసరావు, కోశాధికారి కొణతాల నూకసత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T01:13:05+05:30 IST