టీడీపీ ప్రభంజనం ఆగదు

ABN , First Publish Date - 2023-09-18T02:54:58+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో పెడితే పార్టీ పరిస్థితి దిగజారుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారని, కానీ, వారు ఊహించినట్టు ఏమీ జరగదని, టీడీపీ ప్రభంజనం ఆగబోదని ఆ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు.

టీడీపీ ప్రభంజనం ఆగదు

టీడీపీ ఎంపీలు కనకమేడల, రామ్మోహన్‌ ఫైర్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో పెడితే పార్టీ పరిస్థితి దిగజారుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారని, కానీ, వారు ఊహించినట్టు ఏమీ జరగదని, టీడీపీ ప్రభంజనం ఆగబోదని ఆ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పటికీ పార్టీ దూకుడు తగ్గబోదని అన్నారు. ఈమేరకు టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, రామ్మోహన్‌ ఆదివారం పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులో టీడీపీ అధినేతను జైల్లో పెట్టి వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-09-18T02:54:58+05:30 IST