Tirumala : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు పొందాలనుకుంటున్నారా?

ABN , First Publish Date - 2023-02-08T08:02:28+05:30 IST

శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (బుధవారం) శ్రీవారి సర్వదర్శనానికి 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

Tirumala : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు పొందాలనుకుంటున్నారా?

తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (బుధవారం) శ్రీవారి సర్వదర్శనానికి 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,297 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 23,975 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. కాగా.. నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం12 గంటలకి ఫిబ్రవరి కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈ నెల 22 నుంచి 28 వరకు.. భక్తులు లక్కీడీప్ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంది.

Updated Date - 2023-02-08T08:02:32+05:30 IST