విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను విరమించుకోవాలి

ABN , First Publish Date - 2023-01-26T00:06:27+05:30 IST

వి శాఖ ఉక్కు పరిశ్ర మ ప్రైవేటీకరణను తక్షణమే విరమిం చుకోవాలని, కేంద్ర ప్రభుత్వమే పరిశ్ర మను నడిపించా లని సీపీఐ జిల్లా కా ర్యదర్శి బలగ శ్రీరా మ్మూర్తి డిమాండ్‌ చేశారు. సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు కలెక్టరేట్‌ ముందు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. ప్రభుత్వాలు సొంత గనులను కేటాయించకపోయినా స్టీల్‌ ప్లాంట్‌ ప్రగతి పథంలో నడుస్తోందన్నారు.

విశాఖ ఉక్కు  ప్రైవేటీకరణను విరమించుకోవాలి
కలెక్టరేట్‌ వద్ద నిరసన నిర్వహిస్తున్న నాయకులు

అరసవల్లి: వి శాఖ ఉక్కు పరిశ్ర మ ప్రైవేటీకరణను తక్షణమే విరమిం చుకోవాలని, కేంద్ర ప్రభుత్వమే పరిశ్ర మను నడిపించా లని సీపీఐ జిల్లా కా ర్యదర్శి బలగ శ్రీరా మ్మూర్తి డిమాండ్‌ చేశారు. సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు కలెక్టరేట్‌ ముందు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. ప్రభుత్వాలు సొంత గనులను కేటాయించకపోయినా స్టీల్‌ ప్లాంట్‌ ప్రగతి పథంలో నడుస్తోందన్నారు. ఇటువంటి పరిశ్రమను చౌకగా కార్పొరేట్లకు అమ్మడా నికి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు సహకరిస్తోందని విమర్శించారు. పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 30వ తేదీన విశాఖలో లక్ష మంది కార్మికులతో మహాగర్జన సభ జరగనుందని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు సనపల నర్సింహులు, చాపర సుందరలాల్‌, పి.ప్రభావతి, నీలవేణి, బలగ రామారావు, ఏఐటీయూసీ నాయకులు డోల శంక రరావు, అనపాన షణ్ముఖరావు, కొమర భాస్కరరావు, పి.అప్పారావు, ఉప్పాడ సూర్యనారాయణ, జి.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:06:28+05:30 IST