లోకేష్‌ పాదయాత్రకు అపూర్వ స్పందన

ABN , First Publish Date - 2023-02-06T23:36:50+05:30 IST

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని, ఇది చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం పోలీసులతో పాదయాత్రకు అడు గడుగునా ఆటంకాలు కలిగిస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. లోకేష్‌ పాదయాత్రను చూసి తాడేపల్లి ప్యాలెస్‌లోని జగన్‌ రెడ్డికి చెమటలు పడు తున్నాయన్నారు.

లోకేష్‌ పాదయాత్రకు అపూర్వ స్పందన
విలేకర్లతో మాట్లాడుతున్న గౌతు శిరీష

పలాస: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని, ఇది చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం పోలీసులతో పాదయాత్రకు అడు గడుగునా ఆటంకాలు కలిగిస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. లోకేష్‌ పాదయాత్రను చూసి తాడేపల్లి ప్యాలెస్‌లోని జగన్‌ రెడ్డికి చెమటలు పడు తున్నాయన్నారు. వంద కిలోమీటర్ల పాదయాత్ర లోనే మూడు వాహనాలను సీజ్‌ చేశా రని, బహిరంగ సభ జరగకుండా నిలుపుదల చేశారని ఆరోపించారు. నాలుగువేల కిలో మీటర్ల పాదయాత్రలో ఎన్ని కేసులు పెడతారో అని ఎద్దేవా చేశారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా పాదయాత్రను అడ్డుకోలేరని ఆమె పేర్కొన్నారు.

వైసీపీ నుంచి 20 కుటుంబాలు టీడీపీలో చేరిక

హరిపురం: భోగాపురం గ్రామం నుంచి వైసీపీకి చెందిన 20 కుటుంబాలు శనివారం టీడీపీలో చేరారు. వీరికి టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతు శిరీష పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అంతకుముందు బుడార్సింగి, భోగాపురం గ్రామాల్లో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంపూర్ణ మద్యనిషేధం, పింఛన్ల పేరుతో వైసీపీ ప్రభుత్వం మహిళలను మోసగించిందని, పన్నులను వేసి ప్రజల పై భారం మోపిందని విమర్శించారు. భోగాపురానికి చెందిన విజయకుమార్‌ పండా, గోపాలకృష్ణపండా, చైతన్య బెహరా, నాగి బెహరా, శివరాం బెహరా తదితర 20 కుటుంబాలు వైసీపీలో చేరారు. విజయకుమార్‌ పండా మాట్లాడుతూ.. పథకాల పంపి ణీలో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని, వైసీపీ పాలనపై ప్రజలు విసు గు చెందారన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని, యువతకు, నిరుపేదలకు మేలు జరుగుతుందనే ఆకాంక్షతో టీడీపీలో చేరుతున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బావన దుర్యోధన, రట్టి లింగరాజు, దాసరి తాతారావు, బి.కర్రయ్య తమిరి భాస్కరరావు, బేసి గణపతి, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:36:51+05:30 IST