ప్రపంచానికి దిక్సూచి సోంపేట థర్మల్‌ప్లాంట్‌ ఉద్యమం

ABN , First Publish Date - 2023-07-15T00:06:35+05:30 IST

: థర్మల్‌ పవర్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా సోంపేటలో జరిగిన ఉద్యమం ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణకు దిక్సూచిగా నిలిచిందని మానవహక్కుల వేదిక ప్రతినిధి వీఎస్‌ కృష్ణ అన్నారు. థర్మల్‌ అమరవీరుల దినోత్సవాన్ని సోంపేటలో శుక్రవారం నిర్వహించారు.

ప్రపంచానికి దిక్సూచి సోంపేట థర్మల్‌ప్లాంట్‌ ఉద్యమం
మాట్లాడుతున్న వీఎస్‌ కృష్ణ

సోంపేట, జూలై 14 : థర్మల్‌ పవర్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా సోంపేటలో జరిగిన ఉద్యమం ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణకు దిక్సూచిగా నిలిచిందని మానవహక్కుల వేదిక ప్రతినిధి వీఎస్‌ కృష్ణ అన్నారు. థర్మల్‌ అమరవీరుల దినోత్సవాన్ని సోంపేటలో శుక్రవారం నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం కళాసీ సంఘం భవనంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. రైతులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి థర్మల్‌ వ్యతిరేక ఉద్యమం చేశారన్నారు. ఈక్రమంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, ఎంతోమంది పోలీసులాఠీ దెబ్బలు తిన్నారన్నారు. ఈ ఉద్యమ ఫలితం అక్కడక్కడా కనిపిస్తోందని తెలిపారు. అయినా ప్రభుత్వాలు మాత్రం కళ్లు తెరవడంలేదన్నారు. థర్మల్‌ కోసం ఇచ్చిన జీవో 1107ను రద్దుచేసి కొత్త జీవో 329 తెచ్చారని, దీన్నికూడా రద్దు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. అదేవిధంగా రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వేడుకుంటున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బీలలో ఎన్‌సీసీ యాజమాన్యం పెద్దగట్లు వేసిందని, వాటిని వెంటనే తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, పర్యావరణ పరిరక్షణసమితి అధ్యక్షుడు వై.కృష్ణమూర్తి, వివిధ సంఘాల ప్రతినిధులు కేవీ జగన్నాథరావు, సూరాడ చంద్రమోహన్‌, సనపల శ్రీరామమూర్తి, వైద్యుడు ప్రధాన శివాజీ, తమ్మినేని రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-15T00:06:35+05:30 IST