మాదక ద్రవ్యాలపై నిఘా పెంచాలి

ABN , First Publish Date - 2023-02-06T23:32:20+05:30 IST

మత్తు పదార్థాలు, మాదక దవ్యాల విక్రయాల నియంత్రణ కోసం మరింత నిఘా పెంచాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

మాదక ద్రవ్యాలపై నిఘా పెంచాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

- కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 6: మత్తు పదార్థాలు, మాదక దవ్యాల విక్రయాల నియంత్రణ కోసం మరింత నిఘా పెంచాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించాలన్నారు. దీనికోసం పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించాలని, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. మందులు షాపుల యజమానులతో సమావేశాలు నిర్వహించి చట్టంలోని అంశాలను వివరించాలన్నారు. విద్యాసంస్థల వద్ద మాదక దవ్యాలతో కలిగే నష్టాలపై హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్‌ పీడీ అనంతలక్ష్మి, ఏఎస్పీ విఠలేశ్వరరావు, జాయింట్‌ యాక్షన్‌ ప్లాన్‌ నోడల్‌ అధికారి ఎస్‌వీ రమణమూర్తి, డీఎంహెచ్‌వో బి.మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:32:21+05:30 IST