రీ సర్వేపై ఇంత నిర్లక్ష్యమా?

ABN , First Publish Date - 2023-02-06T23:30:23+05:30 IST

రీ సర్వేలో జిల్లా వెనుకంజ లో ఉండడంపై జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యమా? అని అధికారులపై మం డిపడ్డారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

రీ సర్వేపై ఇంత నిర్లక్ష్యమా?
మాట్లాడుతున్న జేసీ నవీన్‌

- పట్టాల పంపిణీలో కూడా వెనుకంజ

- జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ ఆగ్రహం

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 6: రీ సర్వేలో జిల్లా వెనుకంజ లో ఉండడంపై జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యమా? అని అధికారులపై మం డిపడ్డారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో ఈ నెలాఖరు నాటికి 223 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 54 గ్రామాల్లోనే పూర్తిచేయడంపై అసహనం వ్యక్తం చేశారు. రీసర్వే మరింత వేగవంతం చేయాలని, తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. స్టోన్‌ ప్లాంటేషన్‌ వేగవంతం కావాలన్నారు. పేదలకు పట్టాలు అందించే కార్యక్రమంలో కూడా జిల్లా అత్యంత వెనుకబడి ఉందన్నారు. జిల్లాలో 2,365 పట్టాలు నేటికీ ప్రింటింగ్‌ కాలేదన్నారు. జిల్లాలో 93శాతం ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. మిగిలిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని ఆదేశించారు. రబీ ఈ-క్రాప్‌లో జిల్లా వెనుకంజలో ఉందన్నారు. ఈకేవైసీ కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. రోజుకు 500మంది రైతులకు ఈకేవైసీ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్వో ఎం.రాజేశ్వరి, వ్యవసాయశాఖ జేడీ కె.శ్రీధర్‌, జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఆర్‌వీ వరప్రసాదరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:30:24+05:30 IST