సీపీఎస్‌ రద్దు కోసమే ‘సంకల్ప దీక్ష’

ABN , First Publish Date - 2023-02-01T23:53:21+05:30 IST

సీపీఎస్‌ రద్దు, పాత పింఛన్‌ పునరుద్ధరణకే ధర్మస్థలిలో సంకల్ప దీక్ష చేపడుతున్నామని యూటీ ఎఫ్‌ నాయకులు పేర్కొన్నారు. బుధవారం మండల విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో పోస్టర్లను ఆవిష్కరించారు.

 సీపీఎస్‌ రద్దు కోసమే ‘సంకల్ప దీక్ష’

కోటబొమ్మాళి: సీపీఎస్‌ రద్దు, పాత పింఛన్‌ పునరుద్ధరణకే ధర్మస్థలిలో సంకల్ప దీక్ష చేపడుతున్నామని యూటీ ఎఫ్‌ నాయకులు పేర్కొన్నారు. బుధవారం మండల విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో పోస్టర్లను ఆవిష్కరించారు. సీఎం జగన్‌ ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన సీపీఎస్‌ రద్దు హామీని వెంటనే అమలు చేయాలని సీపీఎస్‌ జిల్లా కన్వీ నర్‌ నారా యణరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ధర్మస్థలిలో జరుగనున్న సంకల్పదీక్ష కార్యక్రమంలో జిల్లా నుంచి ఎక్కువ మంది ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి వై.వాసుదేవరావు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆనందరావు, సింహాచలం పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:53:22+05:30 IST