మూగజీవికి కర్మకాండ

ABN , First Publish Date - 2023-01-26T00:12:44+05:30 IST

సాధారణంగా కుటుంబసభ్యులు మృతిచెందితే కర్మకాండలు చేస్తాం. పెద్దకర్మ నిర్వహిస్తాం. నలుగురికీ పిలిచి భోజనాలు పెడతాం. అయితే ఆ ఇంట్లో మూగజీవి చనిపోయినా మనిషి వలే కర్మకాండలు, పెదకర్మ నిర్వహించి తమకున్న మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటన. నరసన్నపేటలోని హనుమాన్‌నగర్‌లో బుధవారం జరిగింది.

మూగజీవికి కర్మకాండ
కుక్కకు కర్మకాండలు చేస్తున్న నారాయణరావు కుటుంబసభ్యులు

నరసన్నపేట: సాధారణంగా కుటుంబసభ్యులు మృతిచెందితే కర్మకాండలు చేస్తాం. పెద్దకర్మ నిర్వహిస్తాం. నలుగురికీ పిలిచి భోజనాలు పెడతాం. అయితే ఆ ఇంట్లో మూగజీవి చనిపోయినా మనిషి వలే కర్మకాండలు, పెదకర్మ నిర్వహించి తమకున్న మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటన. నరసన్నపేటలోని హనుమాన్‌నగర్‌లో బుధవారం జరిగింది. నెయ్యిల నారాయణరావు అనే వ్యక్తి జంతు ప్రేమికుడు. కుక్కల పెంచడం అలవాటు. ఈ నేపథ్యంలో సంక్రాంతి రోజు పెంచుతున్న కుక్క మృతి చెందింది. శాస్త్రోక్తంగా అంత్యక్రియ లు పూర్తిచేసి.. బుధవారం 12వ రోజు పెదకర్మ చేశారు. అర్చకులతో పూజలు చేయించారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులను పిలిచి భోజనాలు పెట్టారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - 2023-01-26T00:12:44+05:30 IST