భవన నిర్మాణాల్లో నాణ్యతకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2023-01-24T23:46:19+05:30 IST

: శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో జరుగుతున్న భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీ శ్వరరావు అన్నారు. క్యాం పస్‌లో మంగళవారం ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించారు.

 భవన నిర్మాణాల్లో నాణ్యతకు ప్రాధాన్యం
మాట్లాడుతున్నటిప్రుల్‌ ఐటీ డైరెక్టర్‌ జగదీశ్వరరావు

ఎచ్చెర్ల: శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో జరుగుతున్న భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీ శ్వరరావు అన్నారు. క్యాం పస్‌లో మంగళవారం ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.66.7 కోట్లతో నిర్మిస్తున్న అకడమిక్‌ బ్లాక్‌ను ఈ ఏడాది అక్టోబరుకు సిద్ధం చేస్తున్నా మన్నారు. రూ.2.82 కోట్లతో ప్రస్తుతం ఉన్న భవనాలపై భోజనాల కోసం అదనపు గదులు, రూ.3.5 కోట్లతో ఇంజనీ రింగ్‌ ల్యాబ్‌లను నిర్మిస్తున్నామన్నారు. ఈ పనులు ఏప్రిల్‌ నాటికి పూర్తిచేస్తామన్నారు. ఓఎస్‌డీ ప్రొఫెసర్‌ ఎల్‌డీ సుధాకర్‌బాబు, పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ డీఈఈ వెంకటరెడ్డి, ఏఈ కోదండరావు, ట్రిపుల్‌ ఐటీ ఏఈ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:46:19+05:30 IST