శివరాత్రి జాతరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2023-02-06T23:43:09+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 18, 19 తేదీల్లో జరుగునున్న మహా శివరాత్రి జాతరను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆదేశించారు.

 శివరాత్రి జాతరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి

నెల్లిమర్ల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 18, 19 తేదీల్లో జరుగునున్న మహా శివరాత్రి జాతరను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆదేశించారు. ట్రస్టు బోర్డు సమావేశం ఎందుకు పెట్టలేదంటూ ఆలయ ఈవోపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం దేవస్థానం కార్యాలయంలో ఈవో డీవీవీ ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బడ్డుకొండ పాల్గొన్ని మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తుల కోసం తాగునీటి సదుపాయం కల్పించాలని, వాహనాలకు సీతారామునిపేట జంక్షన్‌ వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. కొండపైకి భక్తులు వెళ్లేందుకు వీలుగా విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురేష్‌బాబు, ట్రస్టు బోర్డు సభ్యులు తిరుమలరెడ్డి శ్రీనివాసరావు, ఆర్డీవోలు సూర్యకళ, అప్పారావు, ఎంపీపీ అంబళ్ల సుధారాణి, సౌత్‌ రైల్వేబోర్డు మెంబర్‌ అంబళ్ల శ్రీరాముల నాయుడు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ చనుమల్ల వెంకటరమణ, సీఐ విజయానాథ్‌, స్థానాచార్యులు గొడవర్తి నరసింహాచార్యులు, ప్రధానార్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు కిరణ్‌, రేజేటి మల్లిఖార్జున శర్మ, పవన్‌కుమార్‌, రామ్‌గోపాల్‌, ఎంపీడీవో జి.గిరిబాల, తహసీల్దార్‌ కేవీ రమణరాజు, ఎస్‌ఐ పి.నారా యణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:43:10+05:30 IST