డీఆర్ఎం దృష్టికి సమస్యలు
ABN , First Publish Date - 2023-01-26T00:12:42+05:30 IST
ఇచ్ఛాపురం రైల్వేగేటుతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు డీఆర్ఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని జనసేన నియోజకవర్గ ఇన్చార్జి దాసరి రాజు అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జనసేన నేతలు, కార్యకర్త లతో సమావేశమయ్యారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైల్వేగేటుతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు డీఆర్ఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని జనసేన నియోజకవర్గ ఇన్చార్జి దాసరి రాజు అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జనసేన నేతలు, కార్యకర్త లతో సమావేశమయ్యారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. రైల్వేగేటు వద్ద వంతెనతో పాటు అండర్ పాసేజ్‌కు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు అడుగెతున్నట్టు కార్యకర్తలు సమావేశంలో ప్రస్తావించారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో పాటు ఖుర్ధా డివిజనల్ రైల్వే మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. సమావేశంలో జనసేన నేతలు తిప్పన దుర్యోధ నరెడ్డి, మత్స్యకార కార్యదర్శి నాగుల హరి, భాస్కర్‌రెడ్డి, సంతోష్మహర్నా పాల్గొన్నారు.