పోర్టుకు భూసేకరణ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2023-09-19T23:59:46+05:30 IST

మూలపేట పోర్టుకు రైలు, రోడ్డు మార్గాలకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎం.నవీన్‌ అధికారులను ఆదే శించారు. మంగళవారం మూలపేట పోర్టు రైలు, రోడ్డు మార్గా లకు సంబంధించి భూసేకరణపై టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు.

పోర్టుకు భూసేకరణ పూర్తి చేయాలి
మాట్లాడుతున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ నవీన్‌

ఇన్‌చార్జి కలెక్టర్‌ నవీన్‌

అరసవల్లి, సెప్టెంబరు 19: మూలపేట పోర్టుకు రైలు, రోడ్డు మార్గాలకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎం.నవీన్‌ అధికారులను ఆదే శించారు. మంగళవారం మూలపేట పోర్టు రైలు, రోడ్డు మార్గా లకు సంబంధించి భూసేకరణపై టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా సంతబొమ్మాళి మండలంలోని రాజపురం, కూర్మనాథపురం, పోతునాయుడుపేట, హేమాలపేట, కాశీ పురం, కోటపాడులో రైల్వే ట్రాక్‌ వేసేందుకు 79.45 ఎకరాలు సిద్ధంగా ఉందని తహసీల్దార్‌ చలమయ్య వివరించారు. రఘు నాథపురం భూములను రోడ్డు కోసం సత్వరమే పోర్టు వారికి అప్పగించాలని టెక్కలి తహసీల్దార్‌ ప్రవళ్లిక ప్రియను ఆదేశిం చారు. బన్నువాడ, వేములవాడ, మోదుగువలస భూముల రైతుల వివరాలను తక్షణమే అందించాలని కోరారు. ఆయా గ్రామాలకు అవార్డు పెండింగ్‌లో ఉందని, ఆ వివరాలు శుక్ర వారం నాటికి పంపాలని టెక్కలి తహసీల్దార్‌కు సూచించారు. సమావేశంలో భూసేకరణ పర్యవేక్షకులు శ్రీనివాసరావు, డి.రామమూర్తి, మారిటైం బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు.

అవసరం ఉన్న చోట పోలింగ్‌ కేంద్రాలు

అసౌకర్యంగా ఉండి, అవసరం ఉన్న చోట పోలింగ్‌ కేంద్రాలను మార్చాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎం.నవీన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీలు, సంబంధిత అధికా రులు, టెక్కలి సబ్‌కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌తో కలిసి ఓట్ల తొల గింపులు, చేర్పులపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రతినిధి పీఎంజే బాబు మాట్లా డుతూ.. షిఫ్టింగ్‌ ఓటర్లకు సంబంధించి శ్రీకాకుళం నియోజక వర్గంలో చేర్పులు, తొలగింపుల జాబితా కావాలని కోరారు. సంబంధిత ఈఆర్వో నుంచి సమాచారాన్ని తీసుకోవాలని ఇన్‌ చార్జి కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో డీఆర్వో ఎం.గణపతి రావు, ఆర్డీవోలు శాంతి, సీతారామమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు మురళీకృష్ణ, జయదేవి, జడ్పీ సీఈవో వెంకటరామన్‌, తహసీల్దార్లు, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, వైసీపీ, సీపీఎం, బీఎస్పీ, బీజేపీ ప్రతినిధులు రౌతు శంకరరావు, డి.గోవింద రావు, కె.గోవిందరావు, సోమేశ్వరరావు, సీతరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-19T23:59:46+05:30 IST