ధాన్యం కొనుగోలు లేక అవస్థలు

ABN , First Publish Date - 2023-01-24T23:46:50+05:30 IST

పండిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని ప్రకటనలు చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో మాత్రం చర్యలు చేపట్టడంలో విఫలం కావడంతో ధాన్యం విక్రయించలేక రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

ధాన్యం కొనుగోలు లేక అవస్థలు
కొత్తూరు: ధాన్యం బస్తాల వద్ద ఆందోళన చెందుతున్న రైతులు

కొత్తూరు: పండిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని ప్రకటనలు చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో మాత్రం చర్యలు చేపట్టడంలో విఫలం కావడంతో ధాన్యం విక్రయించలేక రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. మండలంలోని కుంటిభద్ర గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయ లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పరిధిలో 350 ఎకరాల భూమి ఉండగా, 200 ఎకరాలలో పండిన ధాన్యం కొనుగోలు చేశారని, మిగిలిన 150 ఎకరాల పంట సుమారు మూడు వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఎండ, వానల నుంచి రక్షణ కల్పించేందుకు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం సకాలం లో కొనుగోలు చేయక, కొందరు రైతులు దళారుల బారిన నష్టపోతున్నారని రైతులు అగత ముడి లక్ష్మణరావు, బలివాడ వెంకటరమణ, చోడవరపు జనార్దన, పిన్నింటి నాగరాజు, గులి విందల కృష్ణారావు, నడిమింటి చిట్టిబాబు, అగతముడి వాసు తదితరులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

స్థానిక మిల్లులకే ధాన్యం కేటాయించాలి

నందిగాం: ధాన్యం కొనుగోలుకు సంబంధించి మండల పరిధిలోని రైస్‌మిల్లులకే విక్ర యించేలా అనుమతి పత్రాలు (ట్రక్కు షీట్లు) ఇవ్వాలని పలువురు రైతులు కోరుతున్నారు. ఇతర మండలాలకు కేటాయించడం వల్ల రవాణా ఖర్చులతో అధికంగా ఇబ్బందులు పడు తున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏ మండలానికి చెందిన రైతులకు అక్కడే ధాన్యం విక్రయించేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2023-01-24T23:46:51+05:30 IST