కాన్‌కాస్ట్‌ కార్మికుల సమస్యలపై చర్చలు

ABN , First Publish Date - 2023-02-01T23:56:36+05:30 IST

మండలంలోని వీఆర్‌గూడెంలో వైసీపీ నాయకుడు సువ్వారి గాంధీ నివాసంలో దూసి కాన్‌కాస్ట్‌ కార్మికుల సమస్యలపై కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌డీవీ ప్రసాదరావు,

కాన్‌కాస్ట్‌ కార్మికుల సమస్యలపై చర్చలు

పొందూరు: మండలంలోని వీఆర్‌గూడెంలో వైసీపీ నాయకుడు సువ్వారి గాంధీ నివాసంలో దూసి కాన్‌కాస్ట్‌ కార్మికుల సమస్యలపై కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌డీవీ ప్రసాదరావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.అజయ్‌కార్తికేయలు బుధవారం చర్చించారు. కాన్‌కాస్ట్‌ పరిశ్రమ 2017లో మూత పడడంతో 700 మంది కార్మికులు ఉపాధికోల్పోయారు. దీంతో కార్మికుల సమస్యలపై ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి సువ్వారి గాంధీ తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్చించారు. ఆరు నెలల వేతనబకాయిలు, అలవెన్స్‌లు సుమారు రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉందని గుర్తించారు. కొద్దిరోజుల్లో ఈ బకాయిలు చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చర్చల్లో కార్మికనాయకులు ఆర్‌వీ రాఘవేంద్ర, కె. శ్రీనివాసరావు, ఎల్‌. సత్యం బి. మోహనరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:56:37+05:30 IST