‘విభజన హామీల అమలులో కేంద్రం మోసం’

ABN , First Publish Date - 2023-01-26T00:11:00+05:30 IST

విభజన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు కోరారు. బుధవారం కాశీబుగ్గ జడ్పీ హైస్కూల్లో విద్యార్థి, యువజన సంఘాల సమావేశం నిర్వహించారు.

‘విభజన హామీల అమలులో కేంద్రం మోసం’

కాశీబుగ్గ: విభజన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు కోరారు. బుధవారం కాశీబుగ్గ జడ్పీ హైస్కూల్లో విద్యార్థి, యువజన సంఘాల సమావేశం నిర్వహించారు. ఏఐవైఎప్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్‌, ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రవి మాట్లా డుతూ.. కడపలో ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వే జోన్‌, పోలవరం ప్రాజెక్టుకు, అమరావతి రాజధానికి, 11 విద్యా సంస్థలకు నిధులు ఇవ్వకుండా మోసం చేస్తోందని విమర్శించారు. ఫిబ్రవరి 4వ తేదీకి శ్రీకాకుళం జిల్లాకు చేరుతున్న ప్రత్యేక హోదా బస్సు సమరయాత్రను విజయవంతం చేయాలని కోరారు. మురళి, శ్రీనివాసరావు, కృష్ణ, మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:11:00+05:30 IST