బ్యాంకులు లక్ష్యాలను సాధించాల్సిందే: కలెక్టర్
ABN , First Publish Date - 2023-01-26T00:10:22+05:30 IST
ప్రభుత్వ పథకాలపై విధించిన లక్ష్యాలను బ్యాం కులు సాధించాల్సిందేనని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ స్పష్టం చేశారు. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల ద్వారా ప్రయోజనాలు పొం దుతున్న లబ్ధిదారులకు మరిన్ని సేవలందించాలని సూచించారు.

అరసవల్లి: ప్రభుత్వ పథకాలపై విధించిన లక్ష్యాలను బ్యాం కులు సాధించాల్సిందేనని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ స్పష్టం చేశారు. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల ద్వారా ప్రయోజనాలు పొం దుతున్న లబ్ధిదారులకు మరిన్ని సేవలందించాలని సూచించారు. జడ్పీ సమా వేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల మండలి, జిల్లా స్థాయి సమీక్షామండలి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. జగనన్న తోడు 6వ విడత, చేనేత కార్మికులకు ఆర్థిక చేయూత, వ్యవసాయ, విద్య, స్వయం సహాయకసంఘాలకు రుణాలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక స్వావలంబన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మత్స్య సంసద యోజన, ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఆర్థిక సాక్షరత, తదితర అంశాలపై బ్యాంకులు సాధించిన లక్ష్యాలపై కలెక్టర్ ఆరా తీశారు. వెనుకంజలో ఉన్న బ్యాంకులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాల్సిందేనని ఆదేశించారు. పీఎం ఆవాస్ యోజన, టిడ్కో గృహాల లబ్ధిదారులకు రుణాలను సకాలంలో మంజూ రు చేయాలని, కిసాన్ క్రెడిట్ కార్డుల జారీలో లక్ష్యాలను అధిగమించాలని ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలు శత శాతం జిల్లాలో అమలయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ సీఈవో డి.వరప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్ జీవీబీడీ హరిప్రసాద్, ఆర్బీఐ ఎల్డీవో అనిల్‌కుమార్, నాబార్డ్ డీవీ ఎం.వరప్రసాద్, డీఆర్డీఏ పీడీ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.