ఆలయంలో అరటి గెలల ఉత్సవం

ABN , First Publish Date - 2023-01-26T00:09:46+05:30 IST

కిన్నెరవాడ గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ 53వ వార్షికోత్సవం సందర్భంగా బుధ వారం గ్రామస్థులు ఆలయం లో అరటి గెలలు కట్టి భక్తిని చాటుకున్నారు. అనంతరం భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

ఆలయంలో అరటి గెలల ఉత్సవం
వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కట్టిన అరటి గెలలు

సారవకోట (జలుమూరు): కిన్నెరవాడ గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ 53వ వార్షికోత్సవం సందర్భంగా బుధ వారం గ్రామస్థులు ఆలయం లో అరటి గెలలు కట్టి భక్తిని చాటుకున్నారు. అనంతరం భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయ అర్చకుడు సిద్ధయ్యస్వామి నేతృత్వంలో స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నసంతర్పణ, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్య క్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:09:46+05:30 IST