అదానీ కంపెనీలపై విచారణ జరిపించాలి

ABN , First Publish Date - 2023-02-06T23:51:01+05:30 IST

అదానీ గ్రూప్‌ కంపెనీలపై సమగ్ర విచారణ జరిపించా లని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం డ్‌ చేశారు. పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు సోమవారం నగరంలోని ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

అదానీ కంపెనీలపై విచారణ జరిపించాలి
నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

అరసవల్లి, ఫిబ్రవరి 6: అదానీ గ్రూప్‌ కంపెనీలపై సమగ్ర విచారణ జరిపించా లని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం డ్‌ చేశారు. పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు సోమవారం నగరంలోని ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్య్రం రాక ముందు పేదలు సొమ్ము దాచుకోవడం కోసం ఎంతో ఇబ్బంది పడేవారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్యాంకుల జాతీయకరణ చేయడంతో పాటు ఎల్‌ఐసీ వంటి సంస్థలను ఏర్పాటు చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు భరోసా కల్పించిందని చెప్పారు. కానీ బీజేపీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక ప్రభుత్వరంగ సంస్థలను, వాటి ఆస్తులను బడా వ్యాపారులకు అప్ప గించి, ఆర్థిక నేరాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇటీవల అదానీ గ్రూప్‌ బ్యాం కుల వద్ద రుణాలు తీసుకుని, తన వ్యాపారాలకు వాడుకుని ఆర్థిక నేరాలకు పాల్పడిం దని ఆరోపించారు. దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు సనపల అన్నాజీరావు, అంబటి కృష్ణారావు, పైడి నాగభూష ణరావు, రెల్ల సురేష్‌, కొత్తకోట సింహాద్రినాయుడు, లఖినేని నారాయణరావు, కొత్తకోట లక్ష్మి, అంబటి దాలినాయుడు, దంత త్రినాథరావు, తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస: వైసీపీ ప్రభుత్వం పాలనలో విఫలమయ్యిందని డీసీసీ అధ్యక్షురాలు బోడ్డేపల్లి సత్యవతి ఆరోపించారు. శ్రీహరిపురం, కృష్ణాపురం గ్రామాల్లో హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కాంగ్రెస్‌ నాయకత్వం అవసరమన్నారు. కార్యక్రమంలో నాయకులు అన్నాజీరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:51:02+05:30 IST