శ్వేతగిరి యాత్రకు చురుగ్గా ఏర్పాట్లు

ABN , First Publish Date - 2023-01-26T00:14:28+05:30 IST

శ్వేతగిరి యాత్రకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఐదురోజులు జరగనున్న వేణుగోపాలస్వామి యాత్రకు వేలాదిమంది భక్తులు తరలిరానున్నారు. వీరికి ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా ట్రస్టుబోర్డు చైర్మన్‌ సుగ్గు మధురెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్వేతగిరి యాత్రకు చురుగ్గా ఏర్పాట్లు
ఆలయం వద్ద ఏర్పాట్లు చేసిన క్యూలైన్లు

గార: శ్వేతగిరి యాత్రకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఐదురోజులు జరగనున్న వేణుగోపాలస్వామి యాత్రకు వేలాదిమంది భక్తులు తరలిరానున్నారు. వీరికి ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా ట్రస్టుబోర్డు చైర్మన్‌ సుగ్గు మధురెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు స్వామిని దర్శించుకునేందుకు వీలుగా విశాలంగా క్యూలైన్లు, ఆలయం బయట బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొండపైకి భక్తులు కాలినడకన వెళ్లేందుకు వీలుగా మెట్లమార్గం చాలావరకు బాగుచేయించారు. వేణుగోపాలస్వామివారి యాత్రకు రావాలని మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఆహ్వానపత్రం అందజేసినట్లు మధురెడ్డి తెలిపారు.

Updated Date - 2023-01-26T00:14:28+05:30 IST