నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు

ABN , First Publish Date - 2023-01-24T23:48:51+05:30 IST

రహదారులపై నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగు తున్నాయని సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మంగళవారం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల లో అవగాహన సదస్సు నిర్వహించారు.

 నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు
మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి

టెక్కలి, జనవరి 24: రహదారులపై నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగు తున్నాయని సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మంగళవారం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని వారికి జరి మా నా విధించాలని, ఈ మేరకు కాశీబుగ్గ డీఎస్పీకి లేఖ పంపుతా నని పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్లే ఎక్కువ ప్రమా దాలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థి దశ నుంచి రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎంవీఐ డి.సం జీవరావు మాట్లాడుతూ.. భద్రతా వారోత్సవాల ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రామకృష్ణ, కళాశాల డైరెక్టర్‌ వీవీ నాగేశ్వరరావు, డీన్‌ డాక్టర్‌ విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:48:51+05:30 IST