ఇద్దరిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2023-01-26T00:05:12+05:30 IST

మద్యం బాటిళ్లను అక్రమంగా తరలించిన, విక్రయించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఈబీ ఎస్‌ఐ దస్తగిరి తెలిపారు. కొయ్యకొండ గ్రామానికి చెందిన ఎస్‌.వెంకటేష్‌ అదే గ్రామంలో మద్యం అక్రమంగా విక్రయి స్తుండగా బుధవారం పట్టుబడ్డాడన్నారు.

ఇద్దరిపై కేసు నమోదు

పాతపట్నం: మద్యం బాటిళ్లను అక్రమంగా తరలించిన, విక్రయించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఈబీ ఎస్‌ఐ దస్తగిరి తెలిపారు. కొయ్యకొండ గ్రామానికి చెందిన ఎస్‌.వెంకటేష్‌ అదే గ్రామంలో మద్యం అక్రమంగా విక్రయి స్తుండగా బుధవారం పట్టుబడ్డాడన్నారు. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఎస్‌ఈబీ ఎస్‌ఐ కె.కల్యాణి ఆధ్వర్యంలో మొబైౖల్‌ టీం నిర్వహించిన తనిఖీలో హిరమండలం మండలం ధనుపురం గ్రామానికి చెందిన బి.శ్రీనివాసరావు మద్యం తరలిస్తూ పట్టు బడ్డాడని తెలిపారు. వెంకటేష్‌ నుంచి 12 నిబ్‌ బాటిళ్లు, శ్రీనివాసరావు నుంచి ఒడిసాకు చెందిన మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నా మన్నారు. నిందితులను టెక్కలి కోర్టులో హాజరుపరచగా 15 రోజులు రిమాండ్‌ విధించినట్లు ఆయన తెలిపారు.

మహిళపై దాడికి పాల్పడిన వ్యక్తిపై..

పాతపట్నం: స్థానిక ఉప్పర వీధికి చెందిన బర్ల సుజాతపై జూబిలీ రోడ్‌లోని వి.కృష్ణ దాడి చేసి గాయపరిచాడని బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్తి తగాదాలో విషయంలో దాడికి దిగి గాయపరిచాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు తెలిపారు.

Updated Date - 2023-01-26T00:05:12+05:30 IST