10 టన్నుల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2023-02-06T23:59:30+05:30 IST

కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సోమవారం విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు దాడిచేసి వ్యాపారి కోట్ని రామారావు వద్ద నుంచి రూ.3.90 లక్షలు విలువ చేసే సుమారు 10 టన్నుల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. రీ జనల్‌ విజిలెన్స్‌ అధికారి సురేష్‌బాబు ఆదేశాలతో ఈ దాడి చేశారు. రామారావుని విచారించగా లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేందుకు ఉంచానని అంగీకరించినట్లు విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సింహాచలం తెలిపారు. బియ్యా న్ని స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించామన్నారు. రామారా వుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ అశోక్‌కుమార్‌, సిబ్బంది రామ్మోహన్‌, ఉమ, అప్పన్న, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

 10 టన్నుల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

టెక్కలి: కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సోమవారం విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు దాడిచేసి వ్యాపారి కోట్ని రామారావు వద్ద నుంచి రూ.3.90 లక్షలు విలువ చేసే సుమారు 10 టన్నుల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. రీ జనల్‌ విజిలెన్స్‌ అధికారి సురేష్‌బాబు ఆదేశాలతో ఈ దాడి చేశారు. రామారావుని విచారించగా లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేందుకు ఉంచానని అంగీకరించినట్లు విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సింహాచలం తెలిపారు. బియ్యా న్ని స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించామన్నారు. రామారా వుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ అశోక్‌కుమార్‌, సిబ్బంది రామ్మోహన్‌, ఉమ, అప్పన్న, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:59:37+05:30 IST