జగనన్న ఇళ్లకి రూ.5 లక్షలు ఇవ్వాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2023-01-26T04:30:48+05:30 IST

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అందించే రూ.1.80 లక్షలు ఏమూలకూ సరిపోవని, సిమెంట్‌, ఇసుకతో కలిపి మొత్తం రూ.5 లక్షలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

జగనన్న ఇళ్లకి రూ.5 లక్షలు ఇవ్వాలి: రామకృష్ణ

ధర్మవరం, జనవరి 25: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అందించే రూ.1.80 లక్షలు ఏమూలకూ సరిపోవని, సిమెంట్‌, ఇసుకతో కలిపి మొత్తం రూ.5 లక్షలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోని పోతులనాగేపల్లి జగనన్న కాలనీలో బుధవారం సాయంత్రం పార్టీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. కాలనీలో ఇంటి నిర్మాణం చేపట్టిన రంగస్వామి అనే వ్యక్తిని పలకరించారు. ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతోందని అడిగారు. పునాదికే రూ.లక్ష అయిందని, ఇంటి నిర్మాణం పూర్తయ్యేసరికి రూ.7 లక్షలు అవుతుందని రంగస్వామి తెలిపారు.

Updated Date - 2023-01-26T04:30:48+05:30 IST