తగ్గిన రాత్రి ఉష్ణోగ్రతలు

ABN , First Publish Date - 2023-02-07T03:56:24+05:30 IST

కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉంది. మంచు కూడా కురుస్తోంది. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.

తగ్గిన రాత్రి ఉష్ణోగ్రతలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉంది. మంచు కూడా కురుస్తోంది. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. సోమవారం అరకులోయలో 7.7, జి.మాడుగులలో 8.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో చలి తీవ్రత కొనసాగి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

Updated Date - 2023-02-07T03:56:25+05:30 IST