అంకుడు కర్ర కళాఖండాలకు గుర్తింపు

ABN , First Publish Date - 2023-01-26T03:53:54+05:30 IST

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామానికి చెందిన హస్త కళాకారుడు చింతలపాటి వెంకటపతిరాజుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. ఏటికొప్పాకలో జన్మించిన వెంకటపతిరాజు పదో తరగతి వరకు చదువుకున్నారు.

అంకుడు కర్ర కళాఖండాలకు గుర్తింపు

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామానికి చెందిన హస్త కళాకారుడు చింతలపాటి వెంకటపతిరాజుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. ఏటికొప్పాకలో జన్మించిన వెంకటపతిరాజు పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తరువాత హస్తకళా రంగంలోకి ప్రవేశించారు. అంకుడు కర్ర సహాయంతో అద్భుత కళాఖండాలను తయారుచేయడంతోపాటు సహజసిద్ధ రంగులను వినియోగించడం వెంకటపతిరాజు ప్రత్యేకత. గ్రామంలో 35 సంవత్సరాలుగా ఆయన హస్తకళా నిలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పురస్కారాన్ని హస్త కళారంగానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.

Updated Date - 2023-01-26T03:53:54+05:30 IST