అర్హులందరికీ పథకాలను అందిస్తాం

ABN , First Publish Date - 2023-02-06T23:01:40+05:30 IST

అర్హులైన అందరికీ సంక్షేమ పథకా లను అందిస్తామని ఎమ్మెల్యే బాలి నేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గడపగ డపకు కార్యక్రమంలో భాగంగా సో మవారం 31వ డివిజన్‌ పరిధిలోని మా మిడిపాలెంలో కార్పొ రేటర్‌ నా గజ్యోతి, నాగేశ్వర రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నారు.

అర్హులందరికీ పథకాలను అందిస్తాం
మామిడిపాలెంలో సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే బాలినేని

ఎమ్మెల్యే బాలినేని

ఒంగోలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 6 : అర్హులైన అందరికీ సంక్షేమ పథకా లను అందిస్తామని ఎమ్మెల్యే బాలి నేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గడపగ డపకు కార్యక్రమంలో భాగంగా సో మవారం 31వ డివిజన్‌ పరిధిలోని మా మిడిపాలెంలో కార్పొ రేటర్‌ నా గజ్యోతి, నాగేశ్వర రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నారు. ముందుగా ఇం టింటికీ తిరుగుతూ మహిళలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పథకాలు అందుతున్నాయా లేదా, అందితే ఎన్ని పథకాలు వచ్చాయని తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మహి ళలు పలు రకాల సమస్యలను బాలినేని దృ ష్టికి తెచ్చారు. బాలినేని మా ట్లాడు తూ అర్హత ఉండి పథకాలు అందకపోతే అందిం చేందుకు చర్యలు తీసు కుంటా మన్నారు. కార్యక్రమంలో మేయర్‌ గంగాడ సుజాత, డి ప్యూటీ మేయర్‌ వెల నాటి మాధవరావు, కమిషనర్‌ వెంకటేశ్వరరావుతో పాటు వైసీపీ నాయకులు, వి విధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వంతెన పనులను పరిశీలించిన బాలినేని

ఒంగోలు- కొత్తపట్నం రహదారిలోని బకింగ్‌ హోం కాలవపై జరుగుతున్న వంతెన పనులను సోమవారం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. త్వరలోనే ఈ వంతెనపై రాకపోకలు జరిగేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదే శించారు. వంతెనకు ఇరువైపులా జరుగుతున్న అప్రోచ్‌ రోడ్డుల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంతెన నిర్మాణ పనులను పూర్తి చేసి త్వరలోనే వంతెనపై రాకపోకలను జరిగేలా చూస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 80 శాతం వంతెన పనులు పూర్తయ్యాయని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వంతెన పూర్తి వ్యయం రూ.20.50 కోట్లు కాగా, తెలుగుదేశం పార్టీ హయాంలో కేవలం రూ.8.41 కోట్ల పని మాత్రమే జరిగిందని ఆయన అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ.9.50 లక్షల పనులు జరిగినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఎన్‌సీఆర్‌పీ పథకం ఆగిపోయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ పనిని పూర్తి చేస్తున్నామని ఆయన వివరించారు. బాలినేని వెంట కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మిశారద, జిల్లా వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ రవీంద్రారెడ్డి, మేయర్‌ గంగాడ సుజాత పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:01:41+05:30 IST