ఉద్యోగాల పేరిట టోకరా

ABN , First Publish Date - 2023-02-06T23:08:23+05:30 IST

ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వమంటే బెదరిస్తున్నారని పెద చెర్లోప ల్లికి చెందిన బాధితుడు ఎస్పీ మలిక గర్గ్‌కు ఫిర్యాదు చేసారు. సోమ వారం స్థానిక పోలీస్‌ కార్యాలయ ఆవరణంలోని గెలాక్సీ భవ న్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో పెద చెర్లోపల్లికి చెందిన బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేసారు.

ఉద్యోగాల పేరిట టోకరా
కేజీబీవీ విద్యార్థులను అభినందిచిన ఎస్పీ

ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు

ఒంగోలు (క్రైం), ఫిబ్రవరి 6 : ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వమంటే బెదరిస్తున్నారని పెద చెర్లోప ల్లికి చెందిన బాధితుడు ఎస్పీ మలిక గర్గ్‌కు ఫిర్యాదు చేసారు. సోమ వారం స్థానిక పోలీస్‌ కార్యాలయ ఆవరణంలోని గెలాక్సీ భవ న్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో పెద చెర్లోపల్లికి చెందిన బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేసారు. తనతోపాటు తన సోదరుడు మరో నలుగురు వద్ద రూ.17.90లక్షలను ఒంగోలు వెంకటేశ్వర కాలనీకి చెందిన వ్వక్తి తీసుకొని మోసం చేసినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొ న్నారు. ఉద్యోగం ఇప్పిచకుండా తిరగి డబ్బులు ఇవ్వకుండా తమని ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. అదే విధంగా ఇం కా జిల్లా వ్యాప్తంగా 88 మంది పలు సమస్యలను ఎస్పీకి విన్న వించుకు న్నారు. స్పందనలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరి ష్కరిం చాలని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కె.నాగేశ్వ రరావు, ఎస్వీ శ్రీధరరావు, ఎస్‌ఈబీ డీఎస్పీ బి. మరియదాసు, డీటీసీ డీఎస్పీ రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్‌ రాఘవేం ద్రరావు, ప్వానల్‌ అడ్వకేట్‌ బీవీ శివరామకృష్ణ పాల్గొన్నారు.

కేజీబీవీ విద్యార్థులను అభినందించిన ఎస్పీ

రాష్ట్ర స్థాయిలో స్కూల్‌ గేమ్స్‌లో పతకాలను సాధించిన కేజీబీవీ విద్యార్థులను ఎస్పీ మలికగర్గ్‌ అభినందించారు. గత నెల 31 నుంచి ఈ నెల 3 వరకు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. ఈ పోటీలలో 13 బంగార పతకాలు, 4 వెండి పతకాలు, 4 కాంస్య పతకాలను విద్యార్థులు సాధించారు.

Updated Date - 2023-02-06T23:33:14+05:30 IST