రహదారులు రక్తసిక్తం

ABN , First Publish Date - 2023-01-25T01:12:53+05:30 IST

జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో పలుప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రహదారులు రక్తసిక్త మయ్యాయి. వివిద చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా, పలువురికి గాయాల య్యాయి.

రహదారులు రక్తసిక్తం

జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో పలుప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రహదారులు రక్తసిక్త మయ్యాయి. వివిద చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా, పలువురికి గాయాల య్యాయి.

తర్లుపాడు, జనవరి 24: ఆగి ఉన్న మోటర్‌సైకిల్‌ను వెనుక వైపు నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని కలుజువ్వలపాడు పంచాయతీలోని లింగారెడ్డి కాలనీ వద్ద జరిగింది. మార్కాపురం పట్టణంలోని కొండారెడ్డి కాలనీకి చెందిన వర్రె సుబ్బారాయుడు(33), విబూతి మౌలాలి(35) ఇద్దరు మోటర్‌సైకిల్‌పై ఒంగోలు వెళుతున్నారు. మార్గమధ్యలో లింగారెడ్డి కాలనీ వద్ద బైక్‌ పక్కకు ఆపుకొని ఫోన్‌ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరిని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. అయితే దీన్ని గమనించని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ ముందకు వెళుతుండడంతో ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. దీంతో బస్సును డ్రైవర్‌ నిలిపేశాడు. ఆ సమయంలో డ్రైవరు నిద్రమత్తులో ఉన్నట్లు పలువురు ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఘటన స్థలాన్ని పొదిలి సీఐ సుధాకర్‌బాబు, తాడివారిపల్లె ఎస్‌ఐ ముక్కంటి పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను నమోదు చేశారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు యువకులు మృతి చెందినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనతో సుబ్బారాయుడు, మౌలాలీల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును ధ్వంసం చేయబోగా, పోలీసులు అడ్డుకున్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. వర్రె సుబ్బారాయుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మౌలాలికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్దలు మృతిచెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు బోరున విలపిస్తున్నారు.

ఎర్రగొండపాలెం : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన ఎర్రగొండపాలెంలోని పాలశీతలీకరణ కేంద్రం సమీపంలో జరిగింది. బాధితుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వీరభద్రాపురం గ్రామా నికి చెందిన చప్పిడి చెన్నకేశవులు, సంగాల వెంకటమ్మ (50)లు మిరప కోతల కోసం ద్విచక్ర వాహనంపై త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామానికి పనులకు వెళుతున్నారు. వీరి వాహనానికి పాలకేంద్రం వద్ద పంది అడ్డుగా వచ్చింది. దీన్ని తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదం లో వెనుక సీటులో కూర్చొన్న సంగాల వెంకటమ్మ తలకు తీవ్రగాయమైంది. బాధితులకు ఎర్రగొండపాలెం వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించారు. గాయపడిన చెన్నకేశవులు స్థానిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. తలకు బలమైన గాయమైన వెంకటమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు వైద్యశాలకు స్థానిక తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

బోయలపల్లి వద్ద మరో ప్రమాదం

ఎర్రగొండపాలెం : ద్విచక్ర వాహనంపై బోల్తాపడి ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని బోయలపల్లి గ్రామ వ ద్ద 565 జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. ఈ ప్రమాదంలో నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామానికి చెందిన దోమతోటి శివరాములు, దోమతోటి కోటయ్య, కే.రమేష్‌లు కల సి ద్విచక్ర వాహనంపై మండలంలోని జంగంవారిపల్లెకు వచ్చి తిరిగి వెళుతున్నారు. బోయలపల్లి గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న టాక్టరును తప్పించబోయి ద్విచక్ర వాహనంపై బోల్తాపడింది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన బాధితులు ముగ్గురికి ఎర్రగొండపాలెం వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించారు. మండలంలోని జంగంవారిపల్లె గ్రామంలో సోమవారం ఓ కార్యక్రమానికి హజరై, మంగళవారం ఉదయం తిరుగుప్రయాణంలో బోయలపల్లి వద్ద ప్రమాదం జరిగింది. గాయపడిన బాధితుల్లో దోమతోటి శివరాములు తలకు తీవ్ర గాయ మైంది. బాధితులు ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించినట్లు తెలిసింది.

Updated Date - 2023-01-25T01:12:53+05:30 IST