వడ్డీల భారం తగ్గించండి

ABN , First Publish Date - 2023-01-24T23:45:15+05:30 IST

పొగాకు రైతులకు ఇస్తున్న రుణాలపై ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా వడ్డీలు వసూలు చేయడాన్ని రైతు ప్రతినిధులు తప్పు బట్టారు. స్కేల్‌ ఆఫ్‌ పైనాన్స్‌ నిబంధనల ప్రకారం ఒకే రకమైన వడ్డీ వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు.

వడ్డీల భారం తగ్గించండి
రైతులు, బ్యాంకు ప్రతినిధులతో బోర్డు అధికారుల సమావేశం

బ్యాంకులు, బోర్డు అధికారుల సమావేశంలో పొగాకు రైతులు గగ్గోలు

పంటల బీమా అమలుపై చర్చ

ఒంగోలు, జనవరి 2 4 (ఆంధ్రజ్యోతి) : పొగాకు రైతులకు ఇస్తున్న రుణాలపై ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా వడ్డీలు వసూలు చేయడాన్ని రైతు ప్రతినిధులు తప్పు బట్టారు. స్కేల్‌ ఆఫ్‌ పైనాన్స్‌ నిబంధనల ప్రకారం ఒకే రకమైన వడ్డీ వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల మాండస్‌ తుఫాన్‌తో తీవ్రంగా పంట నష్ట పోయిన నేపథ్యంలో ఈఏడాది తీసుకున్న పంట రుణాలను రీషెడ్యూల్‌ చేయాలని కోరారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న బ్యాంకింగ్‌ సమస్యలు, బీమా వర్తింపుపై సోమవారం స్థానిక ఆర్‌ఎం కార్యాలయంలో బోర్డు అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పొగాకు బోర్డు కార్యదర్శి దివి వేణుగోపాల్‌, ఆర్‌ఎం కృష్ణశ్రీ ఈ సమావేశాన్ని నిర్వహించగా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ యుగంధర్‌తోపాటు పలు ప్రధాన బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. అలాగే గుంటూరుకు చెందిన వ్యవసాయ బీమా కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. పొగాకు బోర్డు సభ్యులు సుబ్బారెడ్డి, ప్ర సాదరావు, బ్రహ్మయ్య, రైతుల తరఫున వివిధ వేలం కేంద్రాల ప్రతినిఽధులైన జి. కొండారెడ్డి. పోతుల నరసింహరావు, రావి ఉమామహేశ్వరరావు, వడ్డెళ్ళ ప్రసాద్‌, వెం కటేశ్వర్లు ఇతర రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం బ్యా రన్‌కు రూ.5.40 లక్షలు వరకు బ్యాంకర్లు రుణం ఇస్తుండగా అందులో రూ.3 లక్షలకు 7శాతం వడ్డీని వసూలు చేస్తుండగా మిగిలిన మొత్తానికి భారీగా వసూలు చేస్తు న్నారని రైతు ప్రతినిధులు అధికారుల దృష్టికి తెచ్చారు. ఒక్కో బ్యాంకు ఒక్కో వి ధంగా చేస్తున్నాయన్నారు. అలాకాకుండా అన్ని బ్యాంకులు ఏడు శాతం వడ్డీనే వసూ లు చేయాలని కోరారు. అలాగే రూ.3లక్షలకుపైన తీసుకునే రుణానికి వసూలు చేస్తు న్న స్టాంపు డ్యూటీని నిలిపివేయాలన్నారు. తక్షణం రుణసాయం అందజేయాలని కోరారు. దీనిపై బోర్డు అధికారులు మాట్లాడుతూ ఒకే విధంగా వడ్డీ వసూలుకు చర్యలు తీసుకోవడంతోపాటు అదనపు రుణం అందజేయాలని బ్యాంకు అధికారు లకు సూచించారు. ఎల్‌డీఎం యుగంధర్‌ స్పందిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అను గుణంగానే బ్యాంకులు వ్యవహరిస్తున్నాయన్నారు. వడ్డీలో తేడాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వచ్చేఏడాది నుంచి ఒకే విధంగా ఉండేలా ప్రయత్నిస్తామన్నారు. రు ణాలు రీషెడ్యూల్‌కు సంబంధించి ప్రభుత్వ గెజిట్‌ వస్తే అలాగే చర్యలు తీసు కుం టామన్నారు. ఎకరాకు రూ.4వేలు ప్రీమియం చెల్లిస్తే వర్షపాతం ఆధారంగా గరి ష్ఠం గా రూ.80వేల వరకు బీమా అవకాశం ఉంటుందని బీమా కంపెనీ వారు తెలి పా రు. ఎకరాకు రూ.4వేలు ప్రీమియం ప్రతిపాదనలపై రైతు ప్రతినిధులు అ భ్యం త రం తెలిపారు. అంతమొత్తం అంటే రైతులకు భారమవుతుందన్నారు. దీనిపై చర్చిం చి, రైతు ప్రతినిధులతో కూడిన కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు.

Updated Date - 2023-01-24T23:45:17+05:30 IST