విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2023-01-26T00:47:22+05:30 IST

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణా మాలు తప్పవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు జి.ఈశ్వరయ్య హెచ్చరించారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను రద్దు చేయాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈశ్వరయ్య ధ్వజం

ఒంగోలు(కలెక్టరేట్‌), జనవరి 25: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణా మాలు తప్పవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు జి.ఈశ్వరయ్య హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిం చామని, ఈనెల 30న విశాఖలో లక్ష మందితో మ హాగర్జన నిర్వహించి స్టీల్‌ ప్లాంటును కాపాడుకుం టామని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీ కరణను నిరసిస్తూ సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యం లో బుధవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ని రవధిక దీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర భవిష్య త్‌కు తోడ్పాటునందించే ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని, అంబానీ లాంటి వ్యక్తులకు అప్పగిస్తే చూ స్తూ ఊరుకొనేది లేదని హెచ్చరించారు. 32మంది ప్రాణాలు బలిదానం చేసి సాధించుకున్న విశాఖ ఉ క్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తు ంటే రాష్ట్రంలోని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మోదీ ప్రభుత్వానికి ఊడిగం చేస్తుందని ధ్వజమెత్తారు. విశాఖ స్టీలు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందనే షాకు చూపి ఇతరుల చేతుల్లో పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించే విష యంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు అత్యం త దారుణంగా ఉన్నాయన్నారు. పారిశ్రామికంగా అ భివృద్ధి చేయాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలను న ష్టాల పేరుతో ఇతరులకు అప్పగించడం దుర్మార్గం గా ఉందని విమర్శించారు. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ కోసం జరిగే ఉద్యమంలో రాష్ట్ర ప్రభుత్వం కలిసిరా కుండా కేంద్రానికి మద్దతు ఇవ్వడం దుర్మార్గంగా ఉందని ధ్వజమెత్తారు. జిల్లా కార్యదర్శి ఎంఎల్‌.నా రాయణ మాట్లాడుతూ విశాఖఫట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందో ళనలు జరుగుతున్నా ప్రభుత్వాలు స్పందించకపోవ డం దారుణమన్నారు. ఈనెల 30న జరిగే మహా గర్జనలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎం.వెంకయ్య, యు.ప్రకాశరావు, పీవీఆర్‌.చౌదరి, కోత్తకోట వెంకటే శ్వర్లు, ఆర్‌.వెంకట్రావు, వీరారెడ్డి తదితరులు పాల్గొ న్నారు.

Updated Date - 2023-01-26T00:47:22+05:30 IST