వైసీపీ అరాచక పాలనతో విసిగిన ప్రజలు

ABN , First Publish Date - 2023-01-24T22:57:49+05:30 IST

రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, వారిని ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు చెప్పారు. దర్శి నగర పంచాయతీలోని 12వ వార్డులో మంగళవారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమం నిర్వహించారు.

వైసీపీ అరాచక పాలనతో విసిగిన ప్రజలు
ప్రజలతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పాపారావు

దర్శి, జనవరి 24 : రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, వారిని ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు చెప్పారు. దర్శి నగర పంచాయతీలోని 12వ వార్డులో మంగళవారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వివరించే కరపత్రాలను ప్రజలకు అందించారు. అనంతరం పాపారావు మాట్లాడుతూ వైసీపీ పాలకులు ప్రజాసామ్య విలువలను తుంగలో తొక్కి ప్రతిపక్షాల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రను అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి భంగపడ్డారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు చిట్టే వెంకటేశ్వర్లు, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్‌ చైర్మన్లు జీ స్టీవెన్‌, తలారి కోటయ్య, పట్టణ టీడీపీ అధ్యక్షుడు యాదగిరి వాసు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పుల్లలచెరువు చిన్నా, నియోజకవర్గ ఐ టీడీపీ కన్వీనర్‌ ఎస్వీ రామయ్య, జిల్లా తెలుగు మహిళ నాయకురాలు ఎం శోభారాణి, నాయకులు పారా గాలయ్య, సంగా తిరుపతిరావు, నారపుశెట్టి మధు, బేళ్ల శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, వలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T22:57:49+05:30 IST