మార్కాపురం లైన్‌ఇన్‌స్పెక్టర్‌ నారాయణపై వేటు

ABN , First Publish Date - 2023-02-01T23:16:55+05:30 IST

మార్కాపురంలో విద్యుత్‌శాఖ లైన్‌మన్‌గా పని చేస్తున్న నారాయణపై వేటు పడింది. ఆయన్ను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆశాఖ ఎస్‌ఈ సత్యనారాయణ బుధవారం వెల్లడించారు.

మార్కాపురం లైన్‌ఇన్‌స్పెక్టర్‌ నారాయణపై వేటు

సస్పెండ్‌ చేసినట్లు విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ వెల్లడి

ఒంగోలు (క్రైం), ఫిబ్రవరి 1 : మార్కాపురంలో విద్యుత్‌శాఖ లైన్‌మన్‌గా పని చేస్తున్న నారాయణపై వేటు పడింది. ఆయన్ను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆశాఖ ఎస్‌ఈ సత్యనారాయణ బుధవారం వెల్లడించారు. నారాయణపై ఇటీవల అవినీతి ఆరోపణలు వచ్చాయి. అదేసమయంలో ఆయన రాసలీలలపై సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ అయ్యింది. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన్ను సస్పెండ్‌ చేసినట్లు ఎస్‌ఈ తెలిపారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.

Updated Date - 2023-02-01T23:16:58+05:30 IST