జనసేన పటిష్ట కోసం కృషి చేయాలి
ABN , First Publish Date - 2023-01-25T01:16:28+05:30 IST
గ్రామస్థాయి నుండి జనసేన పార్టీ మరింత పటిష్ట నిర్మాణం కోసం కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ అన్నారు.

గిద్దలూరు టౌన్, జనవరి 24 : గ్రామస్థాయి నుండి జనసేన పార్టీ మరింత పటిష్ట నిర్మాణం కోసం కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ అన్నారు. మంగళవారం గిద్దలూరు పట్టణంలోని విఠా సుబ్బరత్నం కల్యాణ మండపంలో నియోజకవర్గ ఇన్చార్జ్ బెల్లంకొండ సాయిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రియాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో జనసేనను గెలిపించుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. పవన్‌కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ బెల్లంకొండ సాయిబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో 2 వేల మంది కార్మికులు పనిచేసేలా కంపెనీ ఏర్పాటు చేస్తామన్నారు. వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు, జిల్లా ఉపాధ్యక్షుడు చట్టంప్రసాద్, కార్యదర్శులు ముత్యాల కల్యాణ్, రాయని రమేష్, జిల్లా సం యుక్త కార్యదర్శి గజ్జలకొండ నారాయణ, కాల్వ బాలరంగయ్య, తదితరులు పాల్గొన్నారు.