హామీలను విస్మరించిన జగన్‌

ABN , First Publish Date - 2023-02-06T23:03:47+05:30 IST

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అనుసరిస్తున్న విధా నాలు అత్యంత దారుణంగా ఉన్నాయని సీపీ ఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ ధ్వజ మెత్తారు. ఎన్నికల ముందు ఇళ్లు కట్టి ఇస్తా మని హామీ ఇచ్చిన జగన్‌ అఽధికారంలోకి వ చ్చాక విస్మరించారని ఆరోపించారు.

హామీలను విస్మరించిన జగన్‌
ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ

పేదల ఇళ్లకు రూ.5లక్షలు ఇవ్వాలి

టిడ్కో గృహాలను కేటాయించాలి

కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో

సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ

ఒంగోలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 6 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అనుసరిస్తున్న విధా నాలు అత్యంత దారుణంగా ఉన్నాయని సీపీ ఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ ధ్వజ మెత్తారు. ఎన్నికల ముందు ఇళ్లు కట్టి ఇస్తా మని హామీ ఇచ్చిన జగన్‌ అఽధికారంలోకి వ చ్చాక విస్మరించారని ఆరోపించారు. జగనన్న ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని, టి ట్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని డి మాండ్‌ చేస్తూ సోమవారం సీపీఐ పోరుబాట ధర్నాను కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించారు. సీపీఐ నాయకుడు వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో నారాయణ మాట్లాడారు. అధికారం కోసం పాదయాత్ర సమయంలో అనేక హా మీలిచ్చిన జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ విస్మరించారన్నారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి తాళాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం రూ.1.80లక్షలు మా త్రమే గృహ నిర్మాణానికి కేటాయించడం దుర్మార్గమన్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో రూ1.80 లక్షలతో బెస్‌మెంట్‌ కూడా నిర్మించ లేరన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కే టాయించి పేదలను ఆదుకోవాలన్నారు. జగ నన్న కాలనీలకు భూసేకరణ పేరుతో కోట్లాది రూపాయాలు అక్రమాలకు పాల్పడ్డారని నారా యణ ఆరోపించారు. జిల్లాలో ప్రధానంగా మా ర్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లో భారీ అక్ర మాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఒంగోలులోని 25వేల మంది పేదలకు యర జర్ల వద్ద పట్టాలు ఇచ్చినట్లు హడావుడి చేశా రన్నారు. ఆ కొండ ప్రాంతం మైనింగ్‌ కోసం కే టాయించారని తెలిసి కూడా ఇవ్వడం అక్ర మాలకు పాల్పడ్డం కాదా అని ప్రశ్నించారు. అ సెంబ్లీ ఎన్నికలు సమీపి స్తుండడంతో మరో సారి భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చు ట్టారని విమర్శించారు. ఒంగోలులో టిట్కో ఇళ్ల ను వెంటనే పూర్తి చేసి లబ్ధిదా రులకు అప్ప గించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ నగర కా ర్యదర్శి పీవీఆర్‌ చౌదరి మా ట్లాడుతూ గత రెండు నెలల నుంచి ఇళ్ల నిర్మా ణానికి రూ.5 లక్షలు, టిట్కో ఇళ్లు అప్పగిం చాలని ఆందోళ నలు నిర్వహించినట్లు తెలిపా రు. ధర్నాలో సీ పీఐ నాయకులు ప్రకాశరావు, ఆర్‌ వెంకట్రా వు, ఉప్పుటూరి ప్రకాశరావు, నల్లూరి మురళి, హనుమారెడ్డి, సీతారావమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:03:48+05:30 IST