అభివృద్ధి చేతగాక అసత్య ఆరోపణలా..?

ABN , First Publish Date - 2023-01-24T23:39:47+05:30 IST

ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం చేత కాక వైసీపీ నాయకులు తమ నాయకుడు దామచర్లపై అసత్య ఆ రోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు.

అభివృద్ధి చేతగాక అసత్య ఆరోపణలా..?
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

వైసీపీ వ్యాఖ్యలపై టీడీపీ నేతల ధ్వజం

ఒంగోలు (కార్పొరేషన్‌), జనవరి 24 : ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం చేత కాక వైసీపీ నాయకులు తమ నాయకుడు దామచర్లపై అసత్య ఆ రోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. మంగళవారం ఒంగోలులోని పార్టీ కార్యా లయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కొఠారి నాగేశ్వ రరావు, రావుల పద్మజ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు కావస్తున్నా అభివృద్ధి చేయలేక, వైసీపీ నేతలు దామచర్లను విమర్శించడమే పనిగా పె ట్టుకున్నారని అన్నారు. ఒంగోలు నియోజకవర్గాన్ని బాలినేని శ్రీనివాసులరెడ్డి అభివృద్ధి చేశారో లేక దామ చర్ల అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసునని అన్నారు. ప్రజలను నమ్మించేందుకు అబద్దపుప్రచారాలు చేసు కుంటున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న వైసీపీ శ్రేణులు పదే పదే దామచర్లను వి మర్శించడం పనిగా పెట్టుకున్నారన్నారు. రహదారుల అభివృద్ధి, బ్రిడ్జిల నిర్మాణం, వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చేయడంతో పాటు, డ్రైన్‌లు, పార్కుల అభివృద్ధి టీడీపీ హాయంలోనే జరిగాయన్నారు. విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు ఒక్కసారి ఒంగోలు నియోజకవర్గం మొత్తం తిరిగితే అభివృద్ధి ఏమిటో, అది ఎవరి హయాంలో జరిగిందో తెలుస్తుందన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని ఏమీ చేయ లేకపోయారని, ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేసిన దామచర్ల అభివృద్ధి ఏమిటో చేతల్లో చూపారన్నారు. మరోసారి తమ నాయకుడును విమర్శిస్తే ఉపేక్షించ బోమన్నారు. ప్రభుత్వ శాఖలవారీగా గత తెలుగుదేశం హయంలో జరిగిన అభివృద్ధి వివరాలు తెలుసుకుని మాట్లాడాలని నాయకులు హితవు పలికారు. సమా వేశంలో డాకర్‌ గుర్రాల రాజ్‌ విమల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:39:47+05:30 IST